ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకి కీలక పదవి
NEWS Aug 17,2026 02:17 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని విశేషంగా పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, అడవుల విస్తరణే లక్ష్యంగా పనిచేసే ఈ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీకి నాగబాబు నేతృత్వం వహించనున్నారు.