లక్కవరం గ్రామంలో విగ్రహాల ధ్వంసం
NEWS Aug 17,2026 02:31 pm
చోడవరం మండలం లక్కవరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టిడిపి నాయకులు, విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి సూర్యనారాయణ, కొప్పు నారాయణరావు, ఓబుల్‌రెడ్డి శ్రీనివాసరావు, కర్రీ నరసింహమూర్తి, కొప్పు శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు.