దళితపేటల సమస్యలు పరిష్కరించాలి: CITU
NEWS Aug 17,2026 02:30 pm
పరవాడ: సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ బాపడపాలెం, భరిణికం, పరవాడ దళితపేటల్లో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. పరవాడలో శ్మశాన వాటిక లేకపోవడం, బాపడపాలెంలో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, భరిణికం దళితపేటలో వీధిలైట్లు, నీటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.