HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
NEWS Aug 18,2026 09:19 pm
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన గడువును 23వ తేదీ వరకు పొడిగించారని పేర్కొన్నారు. e-KYC చేయని వారు వెంటనే ఏజెన్సీ కార్యాలయం లేదా డెలివరీ బాయ్‌ను సంప్రదించాలని సూచించారు.