సరుగుడులో లేటరైట్ తవ్వకాలు రద్దు చేయాలి
NEWS Aug 17,2026 02:18 pm
నాతవరం మండలం సరుగుడులో లేటరైట్ తవ్వకాల అనుమతులు రద్దు చేసి, సెప్టెంబర్ 9న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని సీపీఎం నేత డి.వెంకన్న డిమాండ్ చేశారు. సరుగుడును నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. తవ్వకాలతో పర్యావరణం, సాగు-తాగునీటి వనరులకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.