చిన్నారి మృతి.. కుటుంబంలో విషాదం
NEWS Aug 17,2026 02:18 pm
ఎమ్మిగనూరు: దైవందిన్నె గ్రామంలో 14 నెలల చిన్నారి హరిజన తారక్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు రామచంద్ర, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆంజనేయ, గ్రామ కమిటీ సభ్యులు రామాంజనేయులు, నాగరాజు, నాగేష్, పెద్దయ్య, బంగారు అంజిని, రంగన్న, తిప్పన్న, ముకెన్న, రామన్న కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.