గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్
NEWS Aug 16,2026 11:20 pm
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వన్డే ప్రపంచకప్‌ను మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించే అంశాన్ని ICC పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీజీకి ప్రత్యేక నివాళిగా ప్రపంచకప్ ప్రారంభ తేదీని అక్టోబర్ 2తో ముడిపెట్టాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.