కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
NEWS Aug 16,2026 11:01 pm
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రతకు, మౌలిక వసతుల కల్పనకు అటల్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.