ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
NEWS Aug 16,2026 11:00 pm
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. వరంగల్ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఎంతో పోరాట స్ఫూర్తి ఉందని రేవంత్ రెడ్డి కొనియాడారు.ప్రతిపక్షాలు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి బలి తీసుకోవాలని చూస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.