రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NEWS Aug 16,2026 10:52 pm
ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం భాష (65) బిందెలు, బకెట్లు రిపేర్ చేసేందుకు అక్కడికి వచ్చారు. నీటి కోసం రోడ్డు దాటుతుండగా దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.