మురికి కాలువల పనులు ప్రారంభం
NEWS Aug 16,2026 10:51 pm
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని మూడో వార్డులో మురికి కాలువల నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. చిన్నపాటి వర్షానికే ఇళ్ల వద్ద, ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వార్డు సభ్యులు తెలిపారు. సమస్యను పంచాయతీ సమావేశంలో ప్రస్తావించడంతో పనులకు ఆమోదం లభించిందన్నారు. సర్పంచ్ తలారి నాగమణి రమేష్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించగా, వార్డు సభ్యులు అనుమల్ల రమ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.