పాఠశాల అభివృద్ధికి ₹5 వేల విరాళం
NEWS Aug 16,2026 10:51 pm
రాయికల్: మండలంలోని రామాజీపేట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రామాజీపేటకు చెందిన మర్రి కళ్యాణి–తిరుపతి దంపతులు పాఠశాల శాశ్వత నిధికి రూ.5 వేల విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి స్వచ్ఛందంగా విరాళం అందించిన దంపతులను ఏఏపీసీ చైర్మన్ చిలివేరి రజిత, ప్రధానోపాధ్యాయురాలు పాశం స్నేహలత అభినందించారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.