సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
NEWS Aug 16,2026 10:59 pm
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్ విద్యానగర్ విజయదుర్గ కాలనీలో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్ వరాల నర్సింగమ్ పాల్గొన్నారు.