గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నివాళి
NEWS Aug 16,2026 10:59 pm
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి రూరల్ ఎస్సై జి. రవికుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లచ్చన్న బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.