ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ
NEWS Aug 16,2026 10:33 am
కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.హెచ్‌ఎం యన్.చందు మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛకు మూలధనమన్నారు. మహనీయుల స్ఫూర్తితో దేశ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, శాంతి అహింస మార్గంలో నడవాలని సూచించారు. క్రీడా విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు,కోచ్‌లు, విద్యార్థులు పాల్గొన్నారు.