సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
NEWS Aug 16,2026 10:31 am
కరీంనగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ సరస్వతి నగర్‌లో రూ.27.90 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.