పిల్లలు లేని దంపతులకు ఆసరా
శిశుగృహ బాబు దత్తత
NEWS Aug 16,2026 10:32 am
కరీంనగర్ నగరంలోని శిశుగృహకు చెందిన 4 నెలల బాబును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన దంపతులకు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి దత్తత ఇచ్చారు. పిల్లలు లేనివారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని, ఆసక్తి ఉన్నవారు జిల్లా పరిషత్‌లోని డబ్ల్యూసీడీఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సీడబ్ల్యూసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.