‘వికసిత్ భారత్’లో భాగస్వాములు కావాలి
మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపు
NEWS Aug 15,2026 01:11 pm
కరీంనగర్: వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మేయర్ క్యాంపు కార్యాలయం, నగరపాలక సంస్థ (MCK), పరేడ్ గ్రౌండ్‌లలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలిసారి మేయర్ హోదాలో పాల్గొనడం గర్వకారణమన్న ఆయన, నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.