బీజేపీ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
NEWS Aug 15,2026 01:12 pm
కరీంనగర్: వికసిత్ భారత లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభ్యున్నతి కోసం ఐక్యంగా కృషి చేయాలన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.