వెంకటరమణకు 'ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్'
NEWS Aug 15,2026 12:38 am
కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి.వెంకటరమణకు ప్రతిష్టాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ మెడల్’ వరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో ఆయనకు చోటు లభించింది. 1991లో సర్వీసులో చేరిన ఆయన, పలు కీలక కేసుల ఛేదనతో పాటు అందించిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.