ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు- ఎమ్మెల్యే కవాసి లఖ్మాను భేటీ
NEWS Aug 15,2026 01:15 am
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, కుంట ఎమ్మెల్యే కవాసి లఖ్మాను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవాసి లఖ్మాను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఇరువురు నేతలు కొద్దిసేపు పరస్పరం చర్చించుకున్నారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.