కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
NEWS Aug 14,2026 03:22 pm
కుప్పం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ అంశంపై డీఎంకే ఎమ్మెల్యే శ్రీనివాసన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని చెప్పారు. డీఎంకే ఎమ్మెల్యే ఆరోపణలపై స్పందించిన తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన.. హోసూరు ఎయిర్‌పోర్టుని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను పట్టుకొని రాజకీయం చేయొద్దని.. శాసనసభలో స్పష్టమైన ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. హోసూరు నగరం తమిళనాడులోనే ఉన్నా.. బెంగళూరు సిటీలో కలిసిపోయినట్లు ఉంటుంది. కానీ హోసూరులో ఎయిర్‌పోర్టుకి అదే అడ్డంకిగా మారింది.