Logo
Download our app
విజయవాడ నుంచి కాశీకి విమానాలు
NEWS   Aug 14,2026 03:20 pm
గన్నవరం నుంచి నేడు రెండు కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యాయి. వారణాసి, కోల్‌కతాకు వారంలో 3 రోజులు గన్నవరం నుంచి ఈ సర్వీసులు నడపనుంది ఇండిగో. ఈ విమానాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. కోల్‌కతాలో మధ్యాహ్నం 2.10 గం.కు బయలుదేరనుంది ఇండిగో విమానం. మధ్యాహ్నం 3.55 గం.కు వారణాసి చేరుకోనుంది విమానం. వారణాసి నుంచి సాయంత్రం 5.50 గం.కు విజయవాడ రానుంది విమానం. సాయంత్రం 6.20 గం.కు విజయవాడలో బయలుదేరనుంది విమానం. రాత్రి 8.20 గం.కు వారణాసి చేరుకోనుంది ఇండిగో విమానం. తిరిగి వారణాసి నుంచి బయలుదేరి రాత్రి 10.15 గం.కు కోల్‌కతా వెళ్లనుంది విమానం. వారణాసి-కోల్‌కతా సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉందని.. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమంగా భావిస్తున్నా అన్నారు కేంద్రమంత్రి రామ్మోహననాయుడు. ఏపీకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయని.. విజయవాడకు విమాన కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ నుంచి మరిన్ని సర్వీసులు నడుపుతాం అన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ను త్వరలోనే తీసుకొస్తామన్నారు.

Top News

LATEST NEWS   Aug 14,2026 03:25 pm
రాహుల్‌ గాంధీకి భారీ ఊరట
రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న...

LATEST NEWS   Aug 14,2026 03:22 pm
కుప్పంలో ఎయిర్‌పోర్టు....తమిళనాట రచ్చ
కుప్పం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం తమిళనాడులో రాజకీయ రచ్చకు దారితీసింది. హోసూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంటే.. ఏపీ ప్రభుత్వం కుప్పంలో విమానాశ్రయం కోసం భూసేకరణ...

LATEST NEWS   Aug 14,2026 03:17 pm
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది....

⚠️ You are not allowed to copy content or view source