అర్థరాత్రి వెలిగొండ టన్నెల్ లోకి మంత్రి నిమ్మల
NEWS Aug 14,2026 03:13 pm
మంత్రి నిమ్మల రామానాయుడు చాలా కమిట్మెంట్ తో ముందుకెళుతూ ఉంటారు. తాజాగా ఆయన వెలిగొండ పనుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వెలుగొండ టన్నెల్స్ లోకి వెళ్లారు మంత్రి నిమ్మల రామానాయుడు. టీబీఎం మెషిన్ వెలికితీత పనులను ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు. లైనింగ్ పనులను అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల నుంచి తెలుసుకున్నారు నిమ్మల. అర్ధరాత్రి దాదాపు 4 గంటల పాటు టెన్నెల్‍లోనే ఉండి పనులు పర్యవేక్షించారు. మరో వారంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశాలిచ్చారు. ఈ నెలలోనే జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు కృష్ణా జలాలు విడుదల చేస్తారు. సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ లో కృష్ణా జలాలకు జలహారతి ఇస్తారని మంత్రి నిమ్మల చెప్పారు. మూడు దశాబ్దాల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతుందని ఉద్వేగంతో చెప్పారు మంత్రి నిమ్మల. పనులు పూర్తికాకుండానే గొడ్డలి పార్టీ నాయకుడు వెలుగొండను జాతికి అంకితమంటూ మోసం చేశారు. నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నది కూటమి ప్రభుత్వమే అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.