2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ వాహనాలను ప్రవేశపెట్టాలని జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ సంస్థ భావిస్తోంది. తొలుత అవయవ మార్పిడి వంటి వైద్య అవసరాల్లో రవాణాకు వీటిని వినియోగించనున్నట్లు సంస్థ CEO తొమొహిరో తెలిపారు. ఇందుకోసం Air India, సుజుకీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. రన్‌వే అవసరం లేకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగల ఈ వాహనాలు గంటకు 100 km వేగంతో ప్రయాణించగలవని తెలిపారు. భవిష్యత్‌లో భారత్‌లో తయారీ చేపట్టి పశ్చిమాసియా, ఆఫ్రికాకు ఎగుమతులు చేయాలని సంస్థ యోచిస్తోంది.