ముంపు సమస్యకు పరిష్కారం చూపాలి
NEWS Aug 14,2026 10:17 am
గంగాధర నారాయణపూర్ ముంపు బాధితులకు వెంటనే పరిహారం అందించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనసేన నాయకుడు డా. బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజీనామా చేయాలని అన్నారు. సమస్యపై ప్రశ్నించే ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. నారాయణపూర్ ప్రజలకు న్యాయం జరిగే వరకు జనసేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.