పాల ఉత్పత్తిని పెంచాలి: కలెక్టర్
NEWS Aug 14,2026 10:18 am
హనుమకొండ: పాడి రైతులకు అవసరమైన సహకారం అందించి, పాల ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని విజయ డైరీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. పాల సేకరణ, శీతలీకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పాల నాణ్యత పరీక్షించే ప్రయోగశాలను పరిశీలించారు. పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలు, పాల ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.