ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్!
NEWS Aug 14,2026 04:22 am
ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో నుంచి ఆగస్టు 15న సూపర్ లగ్జరీ బస్సులో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ద్వారా గోవా యాత్ర నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సరస్వతి తెలిపారు. హైదరాబాద్, హంపి మీదుగా కర్ణాటకలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ దైవదర్శనాల అనంతరం గోవాకు చేరుకుంటారు. తిరిగి ఆగస్టు 20న నర్సంపేటకు చేరుకుంటుందని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5,500 ఛార్జీగా నిర్ణయించారు. వివరాలకు 9704644543 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.