హాస్టల్‌ను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా
NEWS Aug 14,2026 09:56 am
కరీంనగర్: విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ముక్రాంపురంలోని ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్ హాస్టల్‌ను, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌ను గురువారం ఆమె పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతుల మరమ్మతులు పూర్తయ్యే వరకు విద్యార్థులను ఓల్డ్ హైస్కూల్ క్యాంపస్‌కు తరలించి, వసతితో పాటు తరగతులు నిర్వహించాలని సూచించారు.