నిరుపేద గర్భిణులకు అన్నప్రసాదం
NEWS Aug 14,2026 10:04 am
కామారెడ్డి ప్రాంతానికి చెందిన పల్లె బాలరాజు గౌడ్, దుబాయ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరుపేద గర్భిణులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి రెండు నెలల క్రితం శ్రీకారం చుట్టగా, నేటికీ నిరంతరంగా కొనసాగుతోంది. పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న బాలరాజు గౌడ్ సేవలను స్థానికులు అభినందిస్తున్నారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.