ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ
NEWS Aug 14,2026 09:55 am
కరీంనగర్ బీజేపీ నార్త్ జోన్ ఆధ్వర్యంలో ఎస్ఆర్‌ఆర్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని గౌరవంగా ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.