మెట్ పల్లి మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు సంబరాలు
NEWS Aug 12,2026 08:25 pm
మెప్మా ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలో స్థానిక మహిళలు, మెప్మా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా గోరింటాకు పెట్టుకుంటూ ఆనందంగా గడిపారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన మహిళలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కార్యాలయ ప్రాంగణాన్ని పండగ వాతావరణంగా మార్చారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంతో పాటు మహిళల మధ్య ఐక్యతను పెంపొందించడమే ఈ వేడుకల ఉద్దేశమని మెప్మా ప్రతినిధులు తెలిపారు.