158వ సినిమా టైటిల్ గుట్టు విప్పేసిన చిరు
NEWS Aug 12,2026 03:52 pm
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని అనుకోకుండా బయటపెట్టేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌లో తన 158వ సినిమా టైటిల్‌ను ఆయనే స్వయంగా లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో #ChiruLeaks అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి తన 158వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి 'కదిరి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి సరదాగా వేదికపై వెల్లడించారు. ఈవెంట్‌లో లీక్‌ల గురించి ప్రస్తావన రాగా, సంగీత దర్శకుడు తమన్ వద్దని వారిస్తున్నా, "టీజర్ మ్యూజిక్ అయ్యిందా? చివర్లో 'కదిరి' అని టైటిల్ పెట్టారా?" అని చిరంజీవి అడగడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాదు తన పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు.