ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా
NEWS Aug 12,2026 03:29 pm
ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా కొట్టాలని భావిస్తోంది. కేవలం మండలికి వెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు ఎంపికయ్యారు. అసెంబ్లీలో ఉన్నవి రెండు పక్షాలే.. మూడోది లేదన్నారు బొత్స సత్యనారాయణ. మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని బొత్స ప్రశ్నించారు. అసెంబ్లీలో రాకపోతే.. చట్టంలో ఉంటే డిస్‌క్వాలిఫై చేయండన్నారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ.