రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి
NEWS Aug 11,2026 08:55 pm
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా తమ బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీబీసీ వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’పై నిర్వహిస్తున్న 2 రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (ఐసీఓపీ), ఫొటో ఎగ్జిబిషన్‌ను సీపీ, కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.