నేరాల నియంత్రణకు చర్యలు
NEWS Aug 11,2026 08:43 pm
గద్వాల జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు చట్టపరంగా శిక్ష పడేలా, బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు. ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి, దర్యాప్తు పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.