గీతన్నల చైతన్య యాత్రలో మాజీ మంత్రి
NEWS Aug 11,2026 08:13 pm
గీత కార్మికులపై ఎక్సైజ్ శాఖ దాడులు నిలిపివేసి, రాష్ట్రంలో మూసివేసిన కల్లు దుకాణాలను వెంటనే తెరిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతన్నల చైతన్య యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.