కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
NEWS Aug 10,2026 11:33 pm
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడగా, భవన శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. భూకంప ప్రభావం పొరుగున ఉన్న ఈక్వెడార్‌తో పాటు పనామాలోనూ కనిపించింది. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.