అంతిమ యాత్రలో సంపత్ కుమార్
NEWS Aug 10,2026 11:12 pm
అయిజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. సంపత్ కుమార్ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడి పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేయించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన ఎక్లాస్పురానికి తరలించారు. ప్రియాంక అంతిమయాత్రలో సంపత్ కుమార్ పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.