33 ఏళ్ల తర్వాత కలిసిన గురుశిష్యులు
NEWS Aug 10,2026 05:43 pm
ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 33 ఏళ్ల తర్వాత గురు-శిష్యులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్‌టుగెదర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి సరదాలు, పరీక్షల టెన్షన్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువుల మందలింపులను గుర్తుచేసుకున్నారు. 33 ఏళ్లలో తాము సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను పరస్పరం పంచుకున్నారు. పూర్వ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, విజయ్‌బాబు పాల్గొని విద్యార్థులతో ఆనందంగా గడిపారు.