Logo
Download our app
ఏపీలో డోలీ కష్టాలకు గుడ్‌బై.....
NEWS   Aug 10,2026 03:46 pm
గిరిజనప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం లభించనుంది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవితల్లి బాట కార్యక్రమం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ ప్రాజెక్టు కింద రెండు దశల్లో మొత్తం రూ.2,078 కోట్ల భారీ వ్యయంతో 2,310 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇప్పటివరకు 905 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. డోలీరహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాటకి శ్రీకారం చుట్టారు. తొలిదశలో రూ.1,005 కోట్ల అంచనాలతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధి పనులు ప్రారంభించారు. పనుల నిర్వహణలో భౌగోళిక పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నారు.అడ్డంగా ఉన్న పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ విధానంలో సురక్షితంగా పడగొట్టి, రాళ్లు తొలగిస్తూ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ, డోలీ కష్టాల నుంచి శాశ్వత విముక్తి కల్పించాలన్న బలమైన సంకల్పంతో అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. రహదారుల నిర్మాణంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. అటవీశాఖ అనుమతుల మంజూరు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో త్వరలోనే మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి.

Top News

LATEST NEWS   Aug 10,2026 05:11 pm
రిహాబిలిటేషన్ వైద్యంలో సురేష్ ఫిజియోథెరపీ సెంటర్ సేవలు
జగిత్యాల: పక్షవాతం, మతిమరుపు, నడవడంలో ఇబ్బందులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి రిహాబిలిటేషన్ వైద్య సేవలు అందిస్తున్నట్లు సురేష్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు...

LATEST NEWS   Aug 10,2026 03:44 pm
రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లయినా...

BIG NEWS   Aug 10,2026 03:38 pm
ఏపీలో పట్టాలెక్కనున్న మెట్రో
ఏపీ వాసులకు గుడ్ న్యూస్. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమయ్యాయి. రెండు...

⚠️ You are not allowed to copy content or view source