జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద నదిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఘాట్ సమీపంలోని ఓ భవనంలోకి వెళ్లింది. పురోహితుడు అనిల్ శర్మ మొసలికి ఎదురుగా కూర్చొని మంత్రాలు జపిస్తూ పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. వరుణ దేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకుని నదిలో విడిచిపెట్టారు.