బీరప్ప స్వామి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్సీ
NEWS Aug 10,2026 10:31 am
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో నిర్వహించిన మహాకాలమ్మ, బీరప్ప స్వామి బోనాల ఉత్సవాల్లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.