అనంతపురం జిల్లా పొగురూరు సమీపంలో రోడ్డుపై ఈ తెల్లవారు జామన రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. 2 వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోయాయి. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది.