మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
NEWS Aug 09,2026 10:06 am
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గంప నరసింహ ముదిరాజ్ (భద్ర) ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా MJPVC వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ నరసింహ, BRSS రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ హాజీబాబా పాల్గొన్నారు. నాగరాజ్ ముదిరాజ్, ఆంజనేయులు ముదిరాజ్, విష్ణు ముదిరాజ్, దేవప్పతో పాటు సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.