కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
NEWS Aug 09,2026 12:01 am
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. థలసీమియా, సికిల్ సెల్, హిమోఫీలియా బాధితులకూ పింఛన్లు మంజూరు చేయనున్నారు. గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.