పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
NEWS Aug 08,2026 06:43 pm
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలతో ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పద్మనాభ గౌడ్, ప్రిన్సిపల్ భగవతి పద్మనాభ గౌడ్, హెడ్‌మాస్టర్ శ్రీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.