ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను విడతలవారీగా విడుదల చేస్తోంది. ట్రస్ట్ మరియు ఆశా (ASHA) ఒప్పందం ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం వందల కోట్లు మంజూరు చేస్తోంది. తాజాగా నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.162.72 కోట్లు చెల్లించింది. గత 4 నెలల్లో రూ.1504 కోట్లు చెల్లించింది ప్రభుత్వం.