కారంపూడి ఎస్ఐ వాసుపై రైతులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎస్ ఐ పై ఆరోపణలున్నాయి. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు రైతులు. న్యాయం కోసం స్టేషన్ కు వెళ్తే ఇబ్బంది పెడుతున్నాడంటున్నారు కారంపూడి రైతులు. ఎస్ ఐపై చర్యలు తీసుకోవాలని.. అతడిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని ఐజికి విజ్ఞప్తి చేశారు రైతులు.