మెట్‌పల్లిలో బీడీ కార్మికులు, వృద్ధులకు చేయూత పింఛన్లు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి బీడీలు చుడుతూ నిరసన తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నందున వారికి పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.